Site icon TeluguMirchi.com

ఆ ఒక్కటి అడగొద్దు అంటున్న సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘2.0’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీ సరసన అమీ జాక్సన్‌ రొమాన్స్‌ చేసింది. సినిమాల వేగం కాస్త తగ్గించిన రజినీ ఇటీవల రాజకీయల గురించి ఆసక్తికరంగా స్పందిస్తున్నాడు. దాంతో రజినీ రాజకీయాల్లోకి రాబోతున్నాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా మీడియా ముందుకు వచ్చిన రజినీ తన తదుపరి సినిమాల గురించి చెబుతుండగా విలేఖరి రాజకీయ ప్రవేశం గురించి ప్రశ్నించాడు. దాంతో రజినీ ఆ ప్రశ్నలు మాత్రం అడగొద్దు అంటూ ముందుగానే తెర దించేశాడు.

తన తలరాత దేవుడి చేతిలో ఉందని, దాని అనుగుణంగా సాగిపోతాను, దేవుడి తనపై పెట్టిన కార్యాలు అన్ని పూర్తి చేస్తాను అంటూ రజినీ చెప్పుకొచ్చాడు. రాజకీయాల్లోకి రానంత మాత్రాన అభిమానులు నిరాశపడకూడదు, అభిమానులకు దూరంగా ఉండను, సినిమాలు నాకు నచ్చినంత వరకు చేస్తూనే ఉంటాను అంటూ రజినీ చెప్పుకొచ్చాడు. అన్నిటిపై క్లారిటీ ఇచ్చిన రజినీ కేవలం రాజకీయాలపై మాత్రం పెదవి విప్పలేదు. ఇటీవల రజినీ తరుచుగా తన అభిమానుల్ని కలుస్తూ వస్తున్నాడు.

Exit mobile version