మే 1న కమల్ హసన్ నటిస్తున్న ‘ఉత్తమ విలన్ ‘ రిలీజ్ కావడం తో అంత పెద్ద చిత్రంతో అందులో కమల్ తో పోటిపడడం ఇష్టం లేక చిత్ర టీం దొంగాట మూవీ ని వాయుదా వేసింది. మే చివరి వారం లో రిలీజ్ చేసిందుకు ప్లాన్ చేస్తున్నారు,
దొంగాట చిత్రం ద్వారా వంశీ కృష్ణ అనే నూతన దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ కానుందని సమాచారం. అంతే కాకుండా తెలుగులోని పలువురు స్టార్ హీరోస్ అంతా కలిసి ఈ సినిమాలోని ఓ పాటలో నటించారు. ఆ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.