Site icon TeluguMirchi.com

వీడియో : రేణుదేశాయ్ బాగా ఎమోషనల్ అయ్యింది


పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె ఒక వీడియో వీడియో షేర్ చేసింది తన జీవితంలో పాతుకుపోయిన జ్ఞాప‌కాలు మ‌ళ్లీ గుర్తొచ్చాయంటూ కొంచెం బాధ‌, ఇంకొంచెం ఆవేద‌న క‌ల‌గ‌లిపి ఆమె రాసుకున్న ఓ క‌వితతో కూడిన వీడియో ఇది.

‘నా మెమోరీస్ ని చూసుకుంటున్నాను. ఆ మాట‌లు, ప‌దాలు, ఆ పేరు చెక్కిన క‌లం నా జ్ఞాప‌కాల్లో ఉన్నాయి. కానీ క‌మ్ముకున్న హిమం క‌రిగిపోయి మ‌ళ్లీ ఆ జ్ఞాప‌కాలు క‌ళ్లెదుట నిలిచాయి. విధి ఎంత బ‌లీయమైనది. మ‌న‌సు లోతుల్లో పాతుకుపోయిన జ్ఞాప‌కాలన్నింటినీ మ‌ళ్లీ తట్టిలేపింది. ఆ జ్ఞాప‌కాల‌ను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పు ప‌ట్టిన క‌లం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్క‌లైన హృద‌యం, నేను రాసుకున్న లేఖల కాగిత‌పు ముక్క‌లు క‌న్పించాయి’’ అంటూ తన వాయిస్ తో ఒక ఎమోషనల్ కవిత వినిపించింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయ్యింది.

Exit mobile version