నవ్వుల గోలీలు వేసి.. ఆరోగ్యాన్ని అందిస్తుంటాడు అలీ! కాట్ర వెల్లి… కాయ్ కచోరీ ఇలాంటి పదాలకు అర్థాల్లేకపోయినా… అవి అలీ నోటి నుంచి వచ్చాయి కాబట్టి నవ్వేస్తోంటాం. నటుడిగా ఆయన స్కోరు 800 సినిమాలు. దశాబ్దాల నుంచి ప్రేక్షకులపై నవ్వుల జల్లు కురిపిస్తున్న అలీ… ఇప్పుడు డాక్టర్ అలీ అయ్యాడు. ఏ సినిమా కోసం..? అని అడక్కండి. నిజంగానే. అలీ ప్రతిభను గుర్తించి అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ అనే సంస్థ అలీకి గౌరవ డాక్టరేట్ ని ప్రకటించింది. ఈనెల 25న కోయంబత్తూర్ లో ఆ పురస్కారాన్ని ప్రధానం చేస్తారు.