Site icon TeluguMirchi.com

విలన్ గా ‘రామ్ చరణ్’

Ramcharan-screams-at-road-vహమ్మయ్య …తెలుగు తెరకు చాన్నాళ్లకు అచ్చ తెలుగు విలన్ దొరికాడు. వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ.. గన్నులు పట్టుకు తిరిగే ఉత్తరాది విలన్ కాదు.

తన చేతికి మట్టి అంటకుండా, తాను కారు దిగకుండా, ముఖంలో ఎటువంటి హావభావాలు తెలియనివ్వకుండా, నడిరోడ్ పై సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను హార్డ్ గా తన అనుచరుల చేత చావ కొట్టించిన రామ్ చరణ్ కన్నా అద్భుతమైన విలనిజం ఎవరు ప్రదర్శించగలరు ? పోనీ ఆ తరువాతయినా… సారేమన్నా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎదురు కేసు పెట్టారా? లేదే ? ఎక్కడ నుచి ఎలా ఫోన్ లు చేయించాలో అలా చేయించి.. పని కానిచ్చారు.

పబ్లిక్ గా దెబ్బలు తిన్నవారు, చొక్కాలు చిరిగి పోయిన వారు, నడవలేక బాధపడుతూ.. పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన వారు.. అంతలోనే మనసు మార్చుకుని ఫిర్యాదు చేయకుండా వెళ్ళేలా చేయడం అంటే ఎంత విలనీ.. ఎంత విలనీ.. ఇవ్వాళ ప్రతి వాడి దగ్గర స్మార్ట్ ఫోన్ లే. అందుకే ఎవరో ఫోటోలు తీస్తే.. పోలీసులు కేసు పెట్టేస్తారా? మరీ అంత అమాయకులా? అవతల ఉన్నది రామ్ చరణ్. వాళ్ళ బాబుది 30 ఇయర్స్ ఇండస్ట్రీ. వన్ ఇయర్ మినిస్ట్ర్రీ. మావా, మావయ్య, అందరూ బడా బాబులే. ఇంకా కేసు ఎవరు పెడతారు? ఎవరు కడతారు? మరి ఇలాంటి మంచి లక్షణాలున్న చరణ్ కన్నా మంచి విలన్ మన సినిమాలకు ఎక్కడ దొరుకుతారు? గాయపడ్డ వారికి మద్దతుగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అందరూ ఒక రోజు హైదరాబాద్ రోడ్లపై కదం తొక్కి, చిరంజీవిని రాజీ నామా చేయమని కోరడానికి ఇదేమన్న సినిమానా?

http://telugumirchi.com/en/photo-gallery/ram-charan-body-guards-attacking-techies-photos.html

 

Exit mobile version