దువ్వాడ కథ ఇదేనా ..?

DJఅల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న తాజా చిత్రం దువ్వాడ జగన్నాధం . గత నెలలో ప్రారంభమైన ఈ చిత్రం , దసరా తర్వాత రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది..ఇక ఈ చిత్రం లో అల్లు అర్జున్ఇ స్టయిల్ చాల కొత్తగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది..అలాగే ఈ చిత్రానికి సంబధించిన తన హెయిర్ స్టయిల్ పిక్ కూడా లీకయి , సంచలనం రేపుతోంది..ఇక ఇదిలా ఉంటే.ఈ చిత్ర కథ ఇదే అంటూ ఓ కథ సోషల్ మీడియా లో తెగ ప్రచారం అవుతుంది..

” బ్రాహ్మణ కుటుంబం కు చెందిన దువ్వాడ జగన్నాధం అగ్రహారం వదిలి హైదరాబాద్ వస్తాడు , అక్కడ రౌడీ గ్యాంగ్ తో తలపడి పోలీసు ఉన్నతాధికారి దృష్టిలో పడడం జరుగుతుందట, ఆ పొలీస్ ఆఫీసర్ ఇచ్చిన పని ఒప్పుకున్నసమయంలో హీరో ఎలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నాడు ? చివరకు ఎలా విజయం సాధించాడు..? అసలు అగ్రహారం వదిలి ఎందుకు బయటకు వస్తాడు అనేది అసలు కథ..అంటూ మీడియా లో జోరుగా ప్రచారం అవుతుంది..మరి ఏది ఎంత వరకు నిజం అనేది చిత్ర యూనిట్ కే తెలియాలి.

దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా , పూజ హగ్దే బన్నీ కి జోడిగా నటిస్తుంది.