Site icon TeluguMirchi.com

ఫ్యాన్సీ రేటుకు డీజే శాటిలైట్ రైట్స్..

DJ-Firstlook

ఇటీవల కాలం లో సినిమా సెట్స్ ఫై ఉండగానే ఫ్యాన్సీ రేటుకు శాటిలైట్ రైట్స్ అమ్ముడువుతూ నిర్మాతలకు లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే బాహుబలి 2 రిలీజ్ కు ముందే దాదాపు రూ. 30 కోట్ల కు శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోగా..తాజాగా అల్లు అర్జున్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు తెరకెక్కిస్తున్న డీజే మూవీ శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకు అమ్ముడు పోయాయని తెలుస్తుంది.

ప్రముఖ జీ తెలుగు ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ డీల్ చాన్నాళ్ల కిందటే పూర్తయిందట. సరైనోడు లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న సినిమా కాబట్టి డీజే రైట్స్ కోసం జీ తెలుగు ఛానెల్ బాగానే ఖర్చుచేసినట్టు ఫిలిం నగర్ టాక్.

బాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్ని గంపగుత్తగా కొనేయడం అనే ట్రెండ్ ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా జీ గ్రూప్… ఆ ట్రెండ్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజుకు సంబంధించిన సినిమాల రైట్స్ ను ఒకేసారి దక్కించుకునేలా డీల్ కుదుర్చుకుందట. ఇందులో భాగంగా శతమానంభవతి శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సదరు ఛానెల్.. ఆ ప్యాకేజీలో భాగంగానే డీజే రైట్స్ ను కూడా సొంతం చేసుకుందని అంటున్నారు.

Exit mobile version