Site icon TeluguMirchi.com

దుమ్ములేపిన ‘ డీజే ‘ ప్రీమియర్ కలెక్షన్స్

అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం డీజే – దువ్వాడ జగన్నాథం భారీ అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం తో ఓపెనింగ్ డే కలెక్షన్స్ దుమ్ములేపాయి. ఇక విడుదలైన అన్ని చోట్ల ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ రావడం తో చిత్ర యూనిట్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు..బన్నీ కెరియర్ లోనే అత్యధిక ఓపెనింగ్ డే కలెక్షన్స్ రాబట్టిందని చెపుతున్నారు.

ఇప్పటికే ఓవర్ సీస్ లో హాఫ్ మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. గురువారం రాత్రి ప్రీమియర్ షోలలో ఈ చిత్రం 350000 డాలర్ల గ్రాస్ ని వసూలు చేసింది. శుక్రవారం 180000 డాలర్ల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా డీజే ఓపెనింగ్స్ భారీ స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ మూవీ లో బన్నీ కి జోడీగా పూజ హగ్దే నటించగా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించాడు.

Exit mobile version