Site icon TeluguMirchi.com

అల్లు అర్జున్ వంట రుచి చూస్తారా ?

అల్

లు అర్జున్ లేటెస్ట్ చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. దిల్ రాజు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఒకటి స్టయిలీస్ లుక్. రెండు బ్రహ్మిన్ పాత్రలో. బ్రహ్మిన్ పాత్ర ఇందులో వినోదాన్ని పంచబోతుంది. తాజగా దీనికి సంబధించిన ఓ లొకేషన్ స్టిల్ కూడా బయటికివచ్చింది. ”వంటలన్నీ ఎలా చేయాలో.’ అంటూ దర్శకుడు హరీష్‌ శంకర్‌ బన్నీకేవో సూచనలిస్తున్నప్పుడు తీసిన ఫొటో ఇది.

సినిమా విషయానికి ఓ పాట, కొన్ని సన్నివేశాలు మినహా చిత్రీకరణ పూర్తయింది. జులైలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేశారు. చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version