Site icon TeluguMirchi.com

విడుదల తర్వాత కొత్త చిక్కుల్లో డీజే..?

అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ రిలీజ్ కు ముందు సినిమాలో నమకం.. చమకం..పదాలు వివాదం లో చిక్కుకున్న సంగతి తెల్సిందే..పోలీస్ స్టేషన్ వరకు ఈ గొడవ వెళ్లడం తో చిత్ర యూనిట్ ఓ మెట్టు దిగి ఆ పదాలను సినిమా లోనుండి తొలగించి వివాదం నుండి బయటపడ్డారు..కానీ ఇప్పుడు మరో వివాదం లో డీజే చిక్కుకున్నట్లు తెలుస్తుంది.

సినిమాలో పవిత్రమైన గాయత్రి మంత్రాన్ని హీరో చెప్పులు వేసుకొని పఠించటంపై పలువురు మండిపడుతున్నారు. పరమ పవిత్రమైన గాయత్రి మంత్రం విశిష్ఠత తెలిసి ఇలాంటి తప్పులు చేస్తారా? ..గాయత్రి మంత్రాన్ని చెప్పులు వేసుకొని పఠించటం పలువురి మనోభావాల్ని దెబ్బ తీస్తుందని మండిపడుతున్నారు. మరి ఈ వివాదం ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి..

Exit mobile version