Site icon TeluguMirchi.com

ట్రైలర్ టాక్: పగిలిపోయేలా వాయించే డీజే

‘పబ్బుల్లో వాయించే డీజేను కాదురా.. పగిలిపోయేలా వాయించే డీజే’ ఇదీ అల్లు అర్జున్ ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’ వరుస. అల్లు అర్జున్ హరీష్ శంకర్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం దువ్వాడ జగన్నాథమ్‌’. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది.

హరీష్ అంటే దైలాగులు అడిరిపోతాయ్. ఇందులోనూ పంచ్ డైలాగులు వున్నాయి. ”ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్‌..! యుద్ధం శరణం గచ్ఛామి’. ‘పబ్బుల్లో వాయించే డీజేను కాదురా.. పగిలిపోయేలా వాయించే డీజే’ . మనం చేసే పనిలో మనం కనిపించాల్సిన అవసరం లేదు. మంచి కనిపిస్తే చాలు. నేను పెద్ద చదువులు చదువు కోలేదు. పెద్ద బాలశిక్ష చదువుకున్నా .. ఇలా క్యాచి డైలాగులు వినిపించాయి.

ఒక వైపు బ్రాహ్మణ యువకుడి గెటప్‌లో, మరోవైపు సూట్‌లో బన్ని పాత్రను ఆసక్తికరంగా చూపించారు. పూజా హెగ్డే గ్లామరస్ గా వుంది. రావు రమేష్ రోల్ కూడా బాగా వుంది. జూన్‌ 23న ‘డీజే’ను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

Exit mobile version