డీజే ను పక్కకు పెట్టేసారా..?

ఇటీవల కాలం లో ఎంత పెద్ద సినేమైనా జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ తప్పనిసారి..ఎంత ప్రమోట్ చేస్తే అంత బాగా ఓపెనింగ్స్ వస్తాయి..బాలీవుడ్ లో అయితే కేవలం సినిమా ప్రమోట్ తోటే భారీ ఓపెనింగ్స్ రాబట్టుకుంటారు..పెద్ద చిన్న అని తేడాలేకుండా అందరూ హీరోలు తమ సినిమాల రిలీజ్ కు మూడు వారాల ముందు నుండే ప్రమోషన్స్ చేస్తూ నానా హడావిడి చేస్తారు..దీంతో మొదటివారం లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోతాయి..కానీ మన దగ్గర అలాకాదు..పిచ్చి జనాలు వల్లే చూస్తారులే అనే ధీమా ప్రతి ఒక్క స్టార్ కు ఉంది. సినిమా చేశామా..జేబులు నిండాయా అని తప్ప ప్రొడ్యూసర్ కు నాల్గు డబ్బుల లాభం తెద్దాం..ప్రమోషన్స్ బాగా చేద్దాం అని ఏ ఒక్క స్టార్ కు ఉండదు..

కాకపోతే అన్ని సినిమాలు ఆలా జరగవు..కొన్ని సినిమాల విషయంలోనే ఆలా జరుగుతుంటాయి..ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే మరో వారం లో అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ వస్తుంది..ఈ మూవీ ఫై కాస్తో కూస్తో అంచనాలు ఉన్నాయి..ఇలాంటి టైం లో సినిమాని బాగా ప్రమోట్ చేస్తే ఓపెనింగ్స్ కుమ్మేయచ్చు..కానీ డీజే మాత్రం ఆలా చేయడం లేదు..ఏదో అభిమానుల కోసం ఆడియో లాంచ్ అన్నట్లు తప్ప సినిమాని ప్రమోట్ చేయడమే మానేశారు..ఏదో హరీష్ కొంతమంది కి ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు..తప్ప హీరో , హీరోయిన్ లతో ఇంతవరకు ఏ ఒక్క ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు లేవు. మాములుగా దిల్ రాజు ప్రమోషన్స్ చేయడం లో దిట్ట అని అంత అంటారు. కానీ డీజే విషయం లో ఎందుకో పక్కకు పెట్టినట్లు అనిపిస్తుంది..దానికి కారణం హీరోనా..లేక సినిమా ఫై అంచనాల అనేది అర్ధం కావడం లేదు.. ఏది ఏమైనప్పటికి ఈ వారమైన కాస్త ప్రమోషన్స్ బాగా చేస్తే ఓపెనింగ్ డే అయినా కలెక్షన్స్ ఓ రేంజ్ లో వస్తాయని సగటు మెగా అభిమానులు కోరుకుంటున్నారు.