డీజే ఫస్ట్ డే టార్గెట్..

అల్లు అర్జున్ నటించిన ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ మరో 24 గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది..ఇప్పటికే అభిమానులు థియేటర్స్ ను ముస్తాబు చేసే పని లో పడ్డారు..భారీ కటౌట్స్ , ప్లెక్సీ లతో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు..ఇక మరోపక్క డీజే ఫస్ట్ డే టార్గెట్ అంటూ ఓ ఫిగర్ బయటకు వచ్చి హల్చల్ చేస్తుంది. బాహుబలి 2 తర్వాత వస్తున్న పెద్ద సినిమా కావడం..అందులోనూ మెగా హీరో నుండి సినిమా వస్తుండడం తో సినీ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది.

తెలుగు రాష్ట్రాలలో డీజే ఈజీగా మొదటి రోజు రూ. 25 నుండి ౩౦ కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు.. రేసు గుర్రం , సర్రైనోడు చిత్రాలతో యూఎస్ మార్కెట్ కూడా బన్నీ కి బాగా పెరిగింది..అక్కడ కూడా డీజే ఫస్ట్ డే మంచి వసూళ్లే కలెక్ట్ చేస్తుందని భావిస్తున్నారు..ఓవరాల్ గా మొదటి వీకెండ్ పూర్తి అయేసరికి డీజే రూ. 50 కోట్లు వసూళ్లు చేస్తుందనే నమ్మకం తో ఉన్నారు..మరి డీజే ఎలా బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లు కొల్లగొడతాడో చూడాలి.