వరుణ్ తేజ్ నటించిన ‘లోఫర్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం అయిన దిశా పటానికి ఆ తర్వాత పెద్దగా అవకాశాలే రావడం లేదు. అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డు చెప్పని ఈ అమ్మడికి కుర్రాళ్లకు పిచ్చెక్కించే అందాలు ఉన్నాయి. అలాంటిది అవకాశాల విషయంలో ఎందుకిలా జరుగుతుంది అని అభిమానులు అనుకుంటున్నారు. కానీ ఈ అమ్మడికి కూడా మంచి మంచి అవకాశాలే వస్తున్నాయి. కానీ పారితోషికం విషయంలో కాస్త అతి చేసి ఎవ్వరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఎక్కువ పారితోషికం ఇస్తే వెంటనే డేట్స్ కేటాయిస్తాను తప్పా పేమెంట్ తగ్గితే కాంప్రమైజ్ అయేది లేదు అని దిశా పటాని చాలా ధృఢంగా ఉంది.
తాజాగా ఈ అమ్మడి అందాలపై ఓ లుక్కు వేసిన దర్శకుడు కొరటాల మహేష్ చిత్రంలోని ఒక పాత్ర కోసం ఈమెను సంప్రదించారట. అయితే పారితోషికం కాస్త ఎక్కువ డిమాండ్ చేసిందట. అంతేకాకుండా వక్కంతం వంశీ కూడా బన్నీ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం దిశా పటానిని అడిగాడట. కానీ బన్నీకి కూడా ఈ అమ్మడు ఇంకా ఒకే చెప్పలేదు. ఇద్దరిలో ఎవరు ఎక్కువ ముట్టజెప్పితే వారికే కేటాయించాలని ఆలోచనలో ఉందట. పెద్ద హీరోలైనా పేమెంట్ విషయంలో తగ్గేది లేదు, కాంప్రమైజ్ కాను అంటోంది. పెద్ద హీరోల చిత్రాలలో అవకాశాలు వచ్చినప్పుడు అమౌంట్ కాస్త అటు ఇటు అయినా కూడా సర్దుకుంటే ఆ తర్వాత మంచి అవకాశాలు వస్తాయి అని ఈ అమ్మడికి ఆలోచన లేనట్టుంది అందుకే ఇలా చేస్తుంది అని సినీ విశ్లేషకులు పెదవి విరుస్తారు.