పాపకు బోర్ కొట్టిందా..? అందుకే చేంజ్ చేసిందా..?

కాల్విన్ క్లెయిన్ అంటే దిశా పటాని..దిశా పటాని అంటే కాల్విన్ క్లెయిన్ అనే రీతిలో అమ్మడు ఆ బ్రాండ్ కు గుర్తింపు తెచ్చిపెట్టింది. రెండు రోజులకోసారి ఆ బ్రాండ్ ఇన్నర్ వేర్ తో పిచ్చేక్కించే ఈ పాప..తాజాగా ఆ బ్రాండ్ ను పక్కన పెట్టి మరో బ్రాండ్ దుస్తులతో కనిపించి అందర్నీ ఆశ్చర్య పరిచింది.

సడెన్ గా ఆమె బ్రాండ్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో..ఓకే బ్రాండ్ బోర్ కొట్టిందా..లేక అమ్మడు అడిగినంత ఇవ్వన్నన్నారా అనేది తెలియదు కానీ తాజాగా కాల్విన్ క్లెయిన్ కు బదులుగా అడిడాస్ ప్యాంట్ వేసుకోవడం అందరికి షాక్ కలిగిస్తుంది.

పూరి జగన్నాధ్ ‘లోఫర్’ తో వెండితెరకు పరిచయం అయిన ఈ భామ..ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఆ తర్వాత తన బికినీలతో సోషల్ మీడియాను షేక్ చేయడం చూసి కాల్విన్ క్లెయిన్ వారు బ్రాండు అంబాజిడర్ గా ఎంచుకున్నారు.