అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒకెత్తు.. ఏజెంట్ మరో ఎత్తు : డైరెక్టర్


యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మేకర్స్ సినిమాని జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు, థియేట్రికల్ ట్రైలర్‌కి సమయం వచ్చింది. ఏప్రిల్ 18న కాకినాడ లో భారీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ప్లాన్ చేస్తోంది ఏజెంట్ చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో ఏజెంట్ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది.

ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రతి సినిమాకి కష్టపడ్డామని చెబుతుంటాం. కానీ ఏజెంట్ లో మాత్రం బాగా కష్టపడింది అఖిల్ గారే. ఏడాదిన్నర పాటు బాడీ మెంటైన్ చేయడం అంత తేలిక కాదు. కానీ ఒక్క రోజు కూడా అలసట చెందలేదు. చాలా డెడికేటడ్ గా చేశారు. ఈ సినిమాలో మరో హైలెట్ మమ్ముటి గారు. ఆయన గొప్పగా సహకారం అందించారు. ఏ రోజు రమ్మంటే ఆ రోజు వచ్చారు. ఆయనతో పని చేయడం ఒక అదృష్టం. ఇక డినో ఇందులో చాలా కొత్తగా వుంటారు. సాక్షి చాలా చక్కగా చేసింది. తనకి మంచి ఫ్యూచర్ వుంది. ఈ సినిమా లుక్ ఇంత బాగా వచ్చిందంటే అది రసూల్ గారి వల్లే జరిగింది. ఏజెంట్ ప్రేక్షకులు, అభిమానులు అంచనాలకు తగ్గట్టు వుంటుంది. ఇకపోతే అఖిల్ ఇప్పటివరకూ చేసింది ఒకెత్తు.. ఏజెంట్ మరో ఎత్తు. అంతేకాదు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళేదే అఖిల్’ అన్నారు.