ఛార్మి చెప్పుతో కొట్టింది ఎవరిని?!

charmiఛార్మికి కోపం వచ్చింది. అలా ఇలా కాదు… చెప్పుతో కొట్టేంత. అదీ.. ఓ యువ దర్శకుడిని. ఈ హాట్ టాపిక్ తోకి వెళ్తే.. ఇటీవల రామ్ గోపాల్ వర్మ ‘వోడ్కా విత్ వర్మ’ అనే పుస్తకాన్ని ఆవిష్కారించారు. ఆ రోజు రాత్రి వర్మ.. మాంఛి పార్టీ ఇచ్చారు. విందుకు వర్మ సన్నిహితులు, బాగా కావాల్సిన వాళ్లు, ముఖ్యంగా శిష్యులు హాజరయ్యారట. ఆ వేడుకకు ఛార్మి కూడా వెళ్లింది. పార్టీ జోష్ గా సాగుతోండగా ఈ యేడాది ఓ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన ఓ వర్థమాన దర్శకుడు తాగిన మత్తులో ఛార్మితో అసభ్యంగా ప్రవర్తించాడట. అంతే…. వెంటనే ఛార్మి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. చెప్పు తీసుకొని ఎడా పెడా వాయించేసిందట. ఈ భాగోతం చూస్తున్న మిగితావాళ్లు ఛార్మి డేరింగ్ చూసి విస్తుపోయారట. ఆ పార్టీలో సదరు దర్శకుడికి వంత పాడిన వాళ్లు ఒక్కరూ లేరట. ఆ దర్శకుడు ఎవరు? అనేదే హాట్ టాపిక్ గా మారింది. ‘వోడ్కా విత్ వర్మ’ పుస్తకావిష్కరణ సభలో .. వర్మని ఎడా పెడా పొగిడేసిన దర్శకుడే. ఛార్మి బాధితుడు అని చెప్పుకొంటున్నారు. ఇంతకీ ఆయన ఎవరో ఛార్మి చెప్పే వరకూ సస్పెన్సే!