సూర్య బ్రదర్స్ కేరాఫ్ హ‌రి

surya-karthiత‌మిళ క‌థానాయ‌కులు సూర్య‌, కార్తిల‌కు ప్రస్తుతం గ‌డ్డుకాలం న‌డుస్తోంది. వ‌రుస‌గా బాక్సాఫీసు ద‌గ్గర ప‌ల్టీ కొడుతూనే ఉన్నారు. ఎన్నో ఆశ‌లు పెట్టుకొన్న బ్రద‌ర్స్ దారుణంగా బోల్తా ప‌డింది. కార్తి ఖాతాలో శ‌కుని, బ్యాడ్ బాయ్‌ ల‌తో ఫ్లాప్స్ అందుకొన్నాడు. ఇప్పుడు వీరిద్దరి భ‌విత‌వ్యం ఒకే ద‌ర్శకుడి చేతిలోఉంది. ఆయ‌నే హ‌రి. సూర్యకి సింగ‌మ్ లాంటి సూప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శకుడాయ‌న‌. ఇప్పుడు ఆ సినిమా కోసం కొన‌సాగింపు తీస్తున్నారు. ఈ సినిమాలో మాస్‌, యాక్షన్ అంశాలు బాగా ద‌ట్టించార‌ట‌. సింగ‌మ్ 2 త‌ర‌వాత ఆయ‌న కార్తితోనూ ఓ సినిమా చేయ‌బోతున్నారు. ఈలోగా కార్తి బిర్యాని పూర్తవుతుంది. అంటే… ఒకే ద‌ర్శకుడు అన్నాద‌మ్ముల సినిమాల్ని, వారి భ‌విత‌వ్యాన్ని మోస్తున్నాడ‌న్నమాట‌. మ‌రి ఎలాంటి ఫ‌లితాలు వ‌స్తాయో?