Site icon TeluguMirchi.com

బాబీకి ఇక్కడ కూడా స్వేచ్చ లేదట!!

ntr-babi-movie2మాస్‌ మహారాజా రవితేజతో ‘పవర్‌’ చిత్రాన్ని తెరకెక్కించి దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్న బాబీకి వెంటనే ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’కు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. అవకాశం అయితే వచ్చింది కాని, ఆ సినిమాకు పలువురు దర్శకులు పని చేశారు. ముఖ్యంగా ప్రతి సీన్‌ను కూడా పవన్‌ ఒప్పుకుంటేనే, ఆయన చేయమంటేనే చేయాల్సి ఉండేది. పవన్‌ చెప్పినట్లుగానే బాబీ సినిమా తీశాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించారు. అందుకే సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఫ్లాప్‌ ప్రభావం దర్శకుడు బాబీపై పడలేదు. ఆ సినిమాకు బాబీ కేవలం గెస్ట్‌ డైరెక్టర్‌ మాత్రమే అని, షాడో డైరెక్టర్‌ వేరే ఉన్నారని అనుకున్నారు. ప్రస్తుతం బాబీ ‘జై లవకుశ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పుడు కూడా బాబీకి స్వేచ్చ లేదని అంటున్నారు.

తనకు అత్యంత సన్నిహితుడు అయిన ఒక వ్యక్తితో బాబీ ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడట. ప్రతి సీన్‌ మరియు షాట్‌ కూడా ఎన్టీఆర్‌ ఇష్ట ప్రకారం తెరకెక్కాలి, ఆయన ఇష్టం వచ్చినట్లుగానే ఉండాలి. సినిమాటోగ్రఫర్‌ మరియు ఎన్టీఆర్‌లు ఇద్దరు కలిసి నా స్వేచ్చను హరిస్తున్నారు అంటూ బాబీ తన సన్నిహితుడి వద్ద వాపోయాడని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ గురించి గతంలో కూడా ఇలాంటి విమర్శలు వచ్చాయి. దర్శకుల పనిలో మే పెడతాడు అనే టాక్‌ ఎన్టీఆర్‌పై ఎప్పటి నుండో ఉంది. బాబీకి స్వేచ్చ లేకుండా తెరకెక్కుతున్న ఈ సినిమా మరో సర్దార్‌ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Exit mobile version