వాల్మీకి తో మాస్ స్టెప్స్ వేయబోతున్న డింపుల్..

తొలిప్రేమ , ఎఫ్ 2 చిత్రాల హిట్ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం వాల్మీకి. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తుండగా..పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. వరుణ్ తో పాటు తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. కాగా ఈ చిత్రంలో ఐటెం సాంగ్ లో తెలుగు అమ్మాయి చిందులు వేయబోతుంది. ఈ ఐట‌మ్ సాంగ్‌లో డింపుల్ హ‌యాతి అనే తెలుగ‌మ్మాయి త‌న స్టెప్పుల‌తో అద‌ర‌గొట్ట‌నుంద‌ట‌. ఈమె ప్రభుదేవ, తమన్నాలు నటించిన ‘దేవి-2’లో కీల‌క పాత్ర పోషించింది.

ఈ చిత్రానికి మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.