కథల విషయంలో పక్కాగా ఉండే నిర్మాత దిల్‌రాజు. రీమేక్ కథలకంటే.. సొంత కథలు రాయించుకొని వాటినే సినిమాలుగా మలుస్తుంటారు. అలాంటిది… ఇప్పుడో రీమేక్ కథలపై దృష్టిసారించారు. అదే… కన్నడ చిత్రం ఉగ్రం. ఈ సినిమా అక్కడ సూపర్ హిట్టయ్యింది. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ సినిమా రీమేక్‌రైట్స్ సంపాదించాలని తెలుగు నుంచి చాలామంది నిర్మాతలు పోటీపడ్డారు. ఆ అవకాశం దిల్‌రాజుకి దక్కింది. ఉగ్రం రీమేక్ రైట్స్‌ని భారీ మొత్తం వెచ్చించి దిల్‌రాజు సొంతం చేసుకొన్నారు. ఈసినిమాని ఆయన ప్రభాస్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దిల్‌రాజు బ్యానర్లో ప్రభాస్ ఇప్పటికే రెండు సినిమాల్లో నటించారు. మున్నా, మిస్టర్పర్ఫెక్ట్ వచ్చాయి. ఇప్పుడు ఉగ్రంతో హ్యాట్రిక్ కొట్టనున్నాడన్నమాట. ప్రస్తుతం బాహుబలి సినిమా షూటింగ్లో తలమునకలై ఉన్నాడు ప్రభాస్. తదుపరి సినిమా ఒప్పుకోవాలన్నా, సెట్స్‌పైకి వెళ్లాలన్నా కనీసం ఓ యేడాది ఆగాల్సిందే.