టాలీవుడ్ ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కామ్ డిస్ట్రబ్యూటర్ ఎవరంటే అందరూ దిల్ రాజు పేరే చెపుతారు..కానీ అప్పడప్పుడు కొన్ని సినిమాలు ప్లాప్ గా మరి నష్టాన్ని అందిస్తాయి..ఈ ఏడాది కూడా కొన్ని అలాగే జరిగాయి..ఈ ఏడాది ఓం నమో వెంకటేశాయ భారీ నష్టాన్నే మిగిల్చింది. కానీ శతమానం భవతి, నేను లోకల్ లాభాలను తెచ్చిపెట్టాయి. ఇటీవల డీజే మూవీ బయ్యర్లకు నష్టాన్నే మిగిల్చిన,రాజు కు మాత్రం లాభాన్ని తెచ్చిపెట్టిందని టాక్. ఇక ఫిదా గురించి ఏం చెప్పిన తక్కువే..అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి భారీ లాభాలను చవిచూస్తున్నాడు రాజు.
కానీ ఇప్పుడు గౌతమ్ నందా, దర్శకుడు సినిమాల వల్ల దిల్ రాజుకు నష్టాలే మిగిలాయని తెలుస్తుంది. గౌతమ్ నందాను నైజాంకు 5.5కోట్లకు దిల్ రాజు తీసుకున్నారు. కానీ మొదటి రోజే సినిమా ప్లాప్ గా తేలింది దీంతో రాజుకు నష్టాలే మిగిలాయి.దాదాపు నాలుగు కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ఫిలిం నగర్ వర్గాలు చెపుతున్నాయి. మొత్తానికి రాజుకు లాభాలు వచ్చినట్లే వచ్చి పోతున్నాయి.