మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలని ప్రతి దర్శకుడు కోరుకుంటూ ఉంటాడు. అలాగే ప్రతి నిర్మాత కూడా తమ బ్యానర్లో చిరంజీవితో సినిమా నిర్మించాలని ఆశ పడుతూ ఉంటారు. తాజాగా దిల్‌రాజు కూడా ఆ జాబితాలో చేరినట్లుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్‌తో సినిమా తీసేందుకు చాలా ప్రయత్నాలు చేసిన దిల్‌రాజు ఆ ప్రయత్నాలు సఫలం చేసుకోలేక పోయాడు. ఇప్పుడు చిరంజీవిపై దిల్‌రాజు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా చరణ్ నిర్మానంలోనే సినిమాలు చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా తర్వాత అల్లు అరవింద్ నిర్మాణంలో చిరంజీవి ఒక చిత్రం చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత దిల్‌రాజుకు డేట్లు ఇచ్చేందుకు చిరంజీవి ఓకే చెప్తాడా చూడాలి. దిల్‌రాజు మంచి కథతో వెళ్తే తప్పకుండా చిరంజీవి డేట్లు ఇస్తాడంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే చిరంజీవి కోసం తన టీంతో కొన్ని కథలు కూడా సిద్దం చేయించడం జరిగింది. అందులో రెండు మూడు ఫైనల్ చేసి చిరంజీవికి చెప్పించే అవకాశం ఉంది.