Site icon TeluguMirchi.com

మీడియా ముందే కంటతడి పెట్టుకున్న దిల్‌రాజు

Dil-Rajuప్రముఖ నిర్మాత దిల్‌రాజు వరుస చిత్రాలను నిర్మిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. అయినా కూడా వాటిని ఆప్వాదించలేక కన్నీటి పర్యంతం అవుతున్నాడు దిల్‌రాజు. అందుకు కారణం తన భార్య అనిత చనిపోవడమే. అనిత గుండెపోటుతో గత నెలలో మృతి చెందడానికి దిల్‌రాజు ఇప్పటికి తట్టుకోలేకపోతున్నారు. అనిత మరణం తర్వాత నుండి ఇప్పటి దాకా దిల్‌రాజు మీడియా ముందుకు రాలేదు. తాజాగా తాను నిర్మించిన ‘శతమానం భవతి’ చిత్రానికి నేషనల్‌ అవార్డు రావడంతో దిల్‌రాజు మీడియాతో మాట్లాడారు. తనకు సక్సెస్‌లు వచ్చినా కూడా వాటిని అనుభవించడానికి అనిత లేదు అంటూ కన్నీటి పర్యంతం అయ్యాడు.

అనితను గుర్తు చేసుకుని మీడియా ముందే కన్నీళ్లు పెట్టుకున్నారు. దిల్‌రాజు నిర్మించిన ‘నేను లోకల్‌’ చిత్రం కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తన ప్రతీ చిత్రంలో కూడా అనిత పేరు ఉంటుంది. అలాంటిది ఇక జీవితంలోనే లేదు అనే విషయాన్ని దిల్‌రాజు జీర్ణించుకోలేకపోతున్నారు. దిల్‌రాజు అన్ని విషయాలో కూడా అనిత ప్రభావం చాలా ఉండేదట. అంతేకాకుండా దిల్‌రాజుకు అనిత అంటే ప్రాణం, అందుకే ఇంకా ఆమె లేదనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు.

Exit mobile version