దిల్ రాజు లిస్ట్ లోకి మరో సినిమా..

టాలీవుడ్ సక్సెస్ ప్రొడ్యూసర్ కామ్ డిస్ట్రబ్యూటర్ అంటే దిల్ రాజు అనే చెప్పాలి..ఈయన బ్యానర్ నుండి సినిమాలు వచ్చిన ఈయన డిస్ట్రబ్యూట్ చేసిన సినిమాలకైనా బయ్యర్లలలో ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొని ఉంటాయి. ప్రస్తుతం ఈయన చేతిలో విడుదలకు సిద్ధముగా ఉన్న ఐదు చిత్రాలు ఉండగా..మరో సినిమా ఈ లిస్ట్ చేరినట్లు తెలుస్తుంది.

డిసెంబర్ 25న దిల్ రాజు బ్యానర్ లో నిర్మించిన ఇద్దరి లోకం ఒకటే సినిమా విడుదల అవుతుంది. జనవరి 9న దర్బార్, పదిన ఆయన సమర్పిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’, 11న అల వైకుంఠపురములో సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సినిమాలు అన్నీ నైజాం, వైజాగ్ ఏరియాలలో దిల్ రాజే విడుదల చేస్తున్నారు. 15న ఎంత మంచి వాడవురా సినిమా కూడా నైజాంలో దిల్ రాజే టేకప్ చేస్తున్నారు. ఇప్పుడు కన్నడం, తెలుగు భాషల్లో తయారైన భారీ ప్రామిసింగ్ సినిమా అతడే శ్రీమన్నారాయణ కూడా దిల్ రాజు చేతిలోకి వచ్చింది.

కన్నడ హీరో రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన అతడే శ్రీమన్నారాయణ.. కేజిఎఫ్ తరువాత భారీ వ్యయంతో నిర్మించబడింది. దీంతో ఈ సినిమా ఫై అందరిలో మంచి అంచనాలే నెలకొని ఉండడం తో ఈ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఎన్ని సినిమాల్లో రాజు గారికి ఎన్ని లాభం తీసుకొస్తాయో చూడాలి.