దిల్ రాజు స్టార్ హీరో ‘పవన్ కళ్యాణ్ ‘ నేనా..?

pawan-raju-movieసక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈరోజు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాం అని ప్రకటన తెలియజేసిన సంగతి తెల్సిందే..అయితే ఆ స్టార్ హీరో ఎవరు..? అనేది అందరి మదిలో కలుగుతున్న ప్రశ్న.

దీనికి సమాదానం పవన్ కళ్యాణ్ నే అని ఫిలిం నగర్ లో వినిపిస్తుంది..ఎందుకంటే ఎప్పటినుండో దిల్ రాజు కు పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేయాలనీ కోరిక..కానీ అది తీరడం లేదు. ఆ మద్య పవన్ సైతం రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తానని మంచి కథ దొరికేతే చేస్తా అని మాట ఇచ్చాడు..కాగా ఇప్పుడు త్రివిక్రమ్ రాజుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు కాబ‌ట్టి దిల్‌రాజు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డేట్స్ కోసం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన‌ట్టు సమాచారం. అందుకు గాను త్రివిక్ర‌మ్ కూడా త‌న వంతుగా రాజు స‌హ‌కారం అందిస్తున్నాడట.

త్రివిక్ర‌మ్, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మంచి స్నేహితులు. ఒక‌రి మాట మ‌రొక‌రు జ‌వ దాట‌రు. కాబట్టి త్రివిక్రమ్ మాట మేరకు పవన్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయడానికి సిద్దం అయ్యాడని టాక్. ప్రస్తుతం పవన్ కోసం త్రివిక్రమ్ మూడు కథలను రెడీ చేసాడట రెండు ఫ్యామిలీ కథలు కాగా , ఒకటి మాత్రం యాక్షన్ మూవీ అట..మరి పవన్ కు ఏ సినిమా నచ్చుతుందో చూడాలి.