‘అల్లుడు’ పై ‘దిల్’ పారేసుకొన్నాడు

alludu
తొలి సినిమా అల్లుడు శీనుతోనే అద‌ర‌గొట్టాడు బెల్లంకొండ శ్రీ‌నివాస్‌. ఈమ‌ధ్య కాలంలో ఏ హీరో తొలి సినిమా.. ఇంత గ్రాండ్‌గా తీయలేద‌ని చిత్ర ప‌రిశ్రమ మొత్తం ముక్త కంఠంతో తీర్మాణించేసింది. హీరోగా శ్రీ‌నివాస్‌కీ మంచి మార్కులు ప‌డిపోయాయి. ఇప్పుడు అంద‌రి దృష్టీ…. శ్రీ‌నివాస్ రెండో సినిమా పైనే. ఈ సినిమా ఎవ‌రు చేస్తారు? ద‌ర్శకుడు ఎవ‌రు? అనే విష‌యంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ న‌డుస్తోంది. ఈలోగా అల్లుడు పై దిల్ రాజు మ‌న‌సు పారేసుకొన్నాడు. శ్రీ‌నివాస్ తో త్వర‌లోనే ఓ సినిమా చేస్తానంటున్నాడు. దానికి సంబంధించిన స్టోరీ డిస్కర్షన్స్ కూడా న‌డుస్తున్నాయ‌ట‌. ఈ చిత్రానికి దిల్ రాజు స్కూల్ నుంచి వ‌చ్చిన ఓ ద‌ర్శకుడు టేక‌ప్ చేస్తాడ‌ని చెప్పుకొంటున్నారు. మ‌రి ఆ ద‌ర్శకుడు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. దిల్ రాజు కంట్లో ప‌డ్డాడంటే… శ్రీ‌నివాస్‌కి బెస్ట్ ఓపెనింగ్ ల‌భించిన‌ట్టే. ల‌క్కీ ఫెలో….!