‘సాహో’ విడుదలైన తర్వాత మద్యలో ఒక వారం విడిచి పెట్టి సెప్టెంబర్ 13న ‘గ్యాంగ్ లీడర్’ చిత్రాన్ని తీసుకు రావాలని నాని అండ్ టీం భావించారు. అదే సమయంలో మెగా ‘వాల్మీకి’ చిత్రాన్ని కూడా విడుదల చేయాలని హరీష్ శంకర్ బలవంతంగా పట్టుబట్టాడు. నిర్మాతలు కూడా సెప్టెంబర్ 13కు వాల్మీకిని రిలీజ్ ఏర్పాట్లు చేశారు. రెండు మీడియం రేంజ్ సినిమాలే అయినా కూడా కాస్త క్రేజ్ ఉన్న సినిమాలు. కనుక రెండు సినిమాలు ఒకేరోజున విడుదలైతే ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని భావించారు.
గ్యాంగ్ లీడర్ చిత్రం నిర్మాతలు ఎంతగా ఒప్పించే ప్రయత్నం చేసినా కూడా వాల్మీకి టీం వెనక్కు తగ్గలేదు. దాంతో క్లాష్ తప్పదని అంతా భావించారు. రెండు సినిమాలకు కూడా డేట్స్‌తో పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సమయంలో రంగంలోకి దిగిన దిల్‌రాజు ఈ రెండు సినిమాల మద్య మద్యవర్తిత్వం చేసి సినిమా విడుదల విషయంలో వాల్మీకి మేకర్స్‌ను ఒప్పించాడు. వారం ఆలస్యంగా అంటే సెప్టెంబర్ 20న వాల్మీకి విడుదల చేసేలా ఒప్పించాడు. నిజానికి ఈ రెండు సినిమాలకు దిల్‌రాజుకు సంబంధం లేదు. కాని ఒక పెద్ద మనిషి తరహాలో ఈ రెండు సినిమాల వివాదంను పరిష్కరించాడని తెలుస్తోంది. దిల్‌రాజు జోక్యం చేసుకోకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద రెండు సినిమాల ఫైట్ తప్పేది కాదు.