దిల్ రాజు బాలీవుడ్ లోకి…

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు…ఇతర భాషల్లో కూడా సినిమాలు నిర్మించి తన సత్తా చాటుకోవాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. ఇప్పటికి ఆయన కోరిక నెరవేరబోతోంది. ఇప్పటికే ఎఫ్ 2 చిత్రాన్ని హిందీ లో బోనీక‌పూర్‌ తో క‌లిసి నిర్మించబోతున్న రాజు..తాజాగా మరో సూపర్ హిట్ చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేయబోతున్నాడు.

నాని నటించిన జెర్సీ చిత్రాన్ని హిందీ లో కరణ్ జోహార్ తో కలిసి రాజు నిర్మించబోతున్నారు. రీసెంట్ గా కరణ్ జోహార్ ఈ చిత్ర హిందీ రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నాడు. మరి కరణ్ తో కలిసి నిర్మిస్తారా..లేక సింగిల్ గా నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది. రీసెంట్ గా మహేష్ తో మహర్షి హిట్ అందుకున్న రాజు..ఈ ఏడాది వరుస హిట్స్ కొడుతూ దూసుకెళ్తున్నారు.