రామ్ చరణ్..అబద్దం చెప్పాడా..?

Ramcharan-screams-at-road-vప్రముఖ నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ్ … తన బాడీగార్డ్స్ తో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై దాడి ఘటన కొత్తమలుపు తిరిగింది. ఈ నెల 5న హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఫనీష్, కాల్యాణ్ లపై రామ్ చరణ్ బాడీ గార్డ్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై చరణ్ మీడయాకు వివరణ ఇస్తూ.. కారులో వెళ్తున్న తమను ఇద్దరు యువకులు వెంబడించడంతో ఇంటి వద్ద ఉన్న ప్రైవేటు బాడీగార్డ్స్ వచ్చి.. వారిని అడ్డుకున్నారని చెప్పారు. అయితే తాజాగా చరణ్ ఇచ్చిన వివరణ పూర్తిగా అవాస్తవమని నిరూపితమయింది. దాడి చేసిన వారు చరణ్ ప్రవేట్ సెక్యూరిటీగా భావిస్తున్నవారు.. ఆయన రక్షణ కోసం ప్రభుత్వం నియమించిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన కానిస్టేబుళ్లని తేలింది. దీంతో ప్రభుత్వం చరణ్ కు కేటాయించిన గన్ మెన్ లను సస్పెండ్ చేసింది.

చరణ్ తనకు ప్రాణ భయం ఉందని, భద్రత కోసం గన్ మెన్ లను కవాలని.. ఆర్నెల్ల క్రితం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, ప్రభుత్వపరంగా గన్ మెన్ ల సౌకర్యం కల్పించలేమని చెప్పడంతో.. చరణ్ పేయింగ్ గన్ మెన్లు ను కోరడంతో.. ఇటీవలే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ కు చెందిన అప్సర్, అంజిరెడ్డి అనే ఇద్దరు కానిస్టేబుళ్లను ప్రభుత్వం గన్ మెన్ లుగా నియమించింది. వాస్తవానికి వీరి పని.. రాంచరణ్ పై ఎవరైనా దాడి చేస్తే.. ప్రతిఘటించడం.. రక్షణ కల్పించడం. అయితే, ఎలాంటి ప్రతిఘటన లేకున్నా… మరో ఇద్దరు ప్రైవేటు బాడీగార్డులతో కలిసి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని.. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను చితకబాదం వివాదాస్పదం అయింది.

ఆచితూచి విలేకరులకు వివరణ ఇచ్చిన ’మగధీరుడు’ ఇప్పుడు ఈ బాడీగాడ్స్ సస్పెండ్ పై ఎలా స్పందిస్తారో చూడాలి మరి!