దానికి నిదర్శనం… టీజర్లే! మహేష్ సినిమా వన్ కంటే ముందే.. రామయ్యా వస్తావయ్యా టీజర్ బయటకు వచ్చింది. బుడ్డోడూ బుడ్డోడూ అంటే బట్టలూడదీసి కొడతా అనే పవర్ ఫుల్ డైలాగు చెప్పాడు ఎన్టీఆర్. ఈ హంగామా మొత్తం మహేష్ బాబు వన్ టీజర్‌తో తుస్సుమంది. వన్ టీజర్ విడుదలైన తొలి రొజు నుంచే నెటిజన్ల సందడి మొదలైపోయింది. పది లక్షల వ్యూవర్స్ వన్ టీజర్ చూశారు.
ఆ తరవాత అత్తారింటికి దారేదితో పవన్ మరో ప్రభంజనానికి తెరలేపాడు. ఈ టీజరూ సూపర్ హిట్టే. వీటితో పోలిస్తే రామయ్యా వస్తావయ్యా టీజర్ తేలిపోయింది. ఎన్టీఆర్ అభిమానగణం క్రమంగా తగ్గిపోతుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?? రొటీన్ కథలు, యాక్షన్ మోజుతో రోత పుట్టించే సినిమాలు తీస్తున్నాడు ఎన్టీఆర్. ఆ ప్రభావమే ఇదంతా. దాంతోపాటు మహేష్, పవన్ ధాటికి తట్టుకోలేకపోతున్నాడు. రామయ్యా వస్తావయ్య హిట్ కొట్టి… ఈ ఇద్దరు హీరోలకూ చెక్ పెట్టే స్థాయికి ఎన్టీఆర్ చేరుకోవాలని నందమూరి ఫ్యాన్స్ ఆశ. మరి అది తీరుతుందా??