Site icon TeluguMirchi.com

మెగా ఫ్యాన్స్ ను భయపెడుతున్న ‘ధృవ’ వ్యూస్…

Dhruva-Gets-Three-Million-V

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధృవ. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారం తిరిగేలోపే యుట్యూబ్ లో ఏకంగా 3 మిలియన్ వ్యూస్ సాధించి , సినిమా ఫై ఎంతటి హైప్ ఉందో గుర్తుచేసింది.

ఇప్పుడు ఆ హైప్ చూసే మెగా అభిమానులు భయపడిపోతున్నారు..ఎందుకంటే ఇప్పటివరకు భారీ హైప్ తో వచ్చిన రామ్ చరణ్ చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయం పొందాయి..ఇటీవల వచ్చిన బ్రూస్ లీ ని తీసుకుంటే అందులో మెగా మీటర్ అండ్ రారా బ్రూస్ లీ అనే పాటలు బాగా హిట్టయిపోవడం , అలాగే చరణ్ డాన్సులు ఊరించేయడంతో , అలాగే మెగా స్టార్ చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరగడం తో సినిమా మీద ఓ రేంజు అంచనాలు పెంచుకున్నారు జనాలు. చివరకు ఏమైంది? సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.

మరి ఇప్పుడు రాబోయే ధృవ విషయం లోనే అది జరుగుతుంది..చిన్న టీజర్ కే భారీ వ్యూస్ వచ్చి అంచనాలు పెంచేస్తుంటే, సినిమా రిలీజ్ టైం కు ఇంకెంత హైప్ వస్తుందో..వాటిని అందుకోవడం లో చరణ్ ఎలా రిచ్ అవుతాడో అని భయపడుతున్నారు. చూడాలి మరి సురేందర్ రెడ్డి ఏం చేస్తాడో.

Exit mobile version