Site icon TeluguMirchi.com

‘ధృవ’ రిలీజ్ డేట్ ఫిక్స్…

Dhruva-release-dateమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అందాల భామ రకుల్ ప్రీతి సింగ్ జంటగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ధృవ. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొస్తుంది. తమిళం లో సూపర్ హిట్ అయినా తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా తెలుగు లో రాబోతుంది.

కొన్ని రోజులుగా ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటన చేసిన సంగతి తెల్సిందే. కానీ ఏ డేట్ కు వస్తుందో అనేది మాత్రం చెప్పలేదు. కాగా తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ డేట్ కు సంబదించిన అధికారిక ప్రకటన చేయడానికి చిత్ర యూనిట్ సిద్దమవుతుంది. అలాగే అదే రోజున ఆడియో ఫంక్షన్ కి సంబంధించిన వివరాలను కూడా తెలియజేస్తారని వినికిడి.

గీత ఆర్ట్స్ బ్యానర్ ఫై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Exit mobile version