Site icon TeluguMirchi.com

అల్లు అరవింద్ కు గట్టి షాక్ ఇచ్చారు

dhruva-free-release-functioఅయిదేళ్ల కిందట వరకు తెలుగు సినిమాల ఫై పెద్దగా ఇంట్రస్ట్ చూపించిన ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్ , ఈ మధ్య కాలం లో తెలుగు సినిమా ల ఫై మరింత ఫోకస్ పెడుతున్నారు. బాలీవుడ్ , హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని రీతిలో మన తెలుగు సినిమాలు కలెక్షన్స్ వసూళ్లు చేయడం తో చాలామంది ఓవర్సీస్ రైట్స్ విషయం లో పోటీపడుతున్నారు. మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ హీరోల చిత్రాలే కాక ఎన్టీఆర్ , నాని , నాగార్జున వంటి హీరోల చిత్రాలకూడా విపరీతమైన ధర కు రైట్స్ కొనుగోలు చేస్తున్నారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయాన్నీ చూసుకుంటే ఓవర్సీస్ లో చరణ్ మార్కెట్ చాల తక్కువ. మగధీర మినహా ఏ చిత్రాలు కూడా ఓవర్సీస్ లో పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న ధృవ చిత్రం ఫై కాస్త అంచనాలు పెట్టుకున్నారు ఓవర్సీస్ డిస్ట్రబ్యూటర్స్, ఎందుకంటే తమిళం లో సూపర్ హిట్ అయినా తనీఒరువన్ చిత్రానికి రీమేక్ కావడం తో ఈ సినిమా బాగుంటుందని భావించి , ‘ధృవ’ ఓవర్సీస్ రైట్స్ కోసం క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ముందునుండి పోటీ పడుతూ వస్తుంది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు బంపర్ రేట్ ని కూడా ఆఫర్ చేసింది. అయితే ఇప్పుడెప్పుడే ధృవ సినిమా ఫై మరింత అంచనాలు పెరుగుతూ వస్తుండడం తో మరికొన్ని రోజులైతే ఓవర్సీస్ రేట్ మరింత ఎక్కువగా పలుకుతుందనే భావనతో నిర్మాత అల్లు అరవింద్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ ఆఫర్ ని హోల్డ్ లో ఉంచుతూ వచ్చాడట.

కాగా ఇప్పుడీ సంస్థ ధృవ చిత్రబృందానికి షాకిచ్చినట్టు సమాచారమ్. ధృవ ఓవర్సీస్ రైట్స్ తీసుకోవడం లేదు. సారీ అనేసిందట క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్. దీంతో షాక్ కి గురైన ధృవ టీం కొత్త డిస్ట్రిబ్యూటర్ ను వెతుక్కునే పనిలో పడింది. సడెన్ గా ఎందుకు వద్దు అన్నారని ఆరా తీయగా చరణ్ గత సినిమాల రిజల్ట్ ని పరిశీలించిన సదరు కంపెనీ.. ధృవ ని కూడా వద్దనుకొన్నట్టు తెలుస్తోంది.

Exit mobile version