‘వర్మ’ గొప్ప మనసు !

తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ తమిళ్ లో “వర్మ”. టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి కోలీవుడ్ లో వర్మగా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవలే వర్మ టీజర్ కూడా వచ్చేసింది. అర్జున్ రెడ్డితో వర్మ ని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో బోలేడు పోస్టులు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయం పక్కన పెడితే. వర్మ గొప్ప మనసు చాటుకొన్నాడు.

వరదలతో అల్లాడిపోయిన కేరళ రాష్ట్రానికి తనవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చాడు.. ఈ కుర్ర హీరో. తన తొలి చిత్రం ‘వర్మ’ కోసం తీసుకొన్న పారితోషికం మొత్తం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి ఆయనకు చెక్కును అందించారు. ధృవ్‌ చేసిన సాయానికి సీఎం అభినందించారు.

ఇక, అర్జున్ రెడ్డి కోలీవుడ్ రిమేక్ ‘వర్మ’కు బాల దర్శకత్వం వహించారు. మేఘా హీరోయిన్ గా నటించింది. త్వరలోనే వర్మని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరోవైపు, బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి రిమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నారు.