సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కలిసి నటిస్తున్న శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో రూపొందుతున్న పాన్-ఇండియన్ సినిమా ‘కుబేర’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ లో నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేస్తూ సినిమాపై అంచనాలు పెంచాయి. శేఖర్ కమ్ముల సినిమాలు ఎప్పుడూ కంటెంట్‌తో పాటు మ్యూజిక్ పరంగా స్పెషల్‌గా ఉంటాయి. ‘కుబేర’ కూడా ఒక మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మరోసారి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను సిద్ధం చేశారు. సంగీతప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘కుబేర’ ఫస్ట్ సింగిల్‌ను ఏప్రిల్ 20న విడుదల చేయబోతున్నారు. రేపే (ఏప్రిల్ 15) సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. తాజాగా వచ్చిన సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ధనుష్ ఎనర్జీగా డ్యాన్స్ చేస్తూ కనిపించి, ఫస్ట్ సింగిల్‌పై ఆసక్తిని రెట్టింపు చేశాడు. కుబేర ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌కు ఖచ్చితంగా ఫుల్ డోస్ ఫీలింగ్ ఇవ్వనుంది.