Captain Miller : ‘కెప్టెన్ మిల్లర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది


కోలీవుడ్ సూపర్ స్టార్ యాక్టర్ ధనుష్ హీరోగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న హై-బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేసాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రేపు (జనవరి 6న) రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు.

ఇకపోతే 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యూజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయికిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ జనవరి 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.