Site icon TeluguMirchi.com

Captain Miller : సంక్రాంతి బరిలోకి మరో భారీ చిత్రం..


నేషనల్ అవార్డ్ విన్నర్, సూపర్ స్టార్ ధనుష్ హై-బడ్జెట్ పీరియడ్ ఫిల్మ్ ‘కెప్టెన్ మిల్లర్’. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ధనుష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 15న రిలీజ్ కావాల్సి వుంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. అయితే రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. అనౌన్స్ మెంట్ పోస్టర్ లో గుబుర గడ్డం, మ్యాసీ హెయిర్, షేడ్స్ తో టెర్రిఫిక్ గా కనిపించారు ధనుష్.

ఇకపోతే 1930-40 బ్యాక్ డ్రాఫ్ లో హ్యాజ్ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. డాక్టర్ శివ రాజ్ కుమార్, సందీప్ కిషన్ పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తున్న ఈ పీరియడ్ ఫిల్మ్ లో ప్రియాంకా అరుళ్‌ మోహన్ కథానాయికిగా నటిస్తోంది. టి.జి. త్యాగరాజన్ సత్యజ్యోతి ఫిల్మ్స్, సెంధిల్ త్యాగరాజన్ , అర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. స్టార్ కంపోజర్ జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘కెప్టెన్ మిల్లర్’ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అయితే ఇప్పటికే టాలీవుడ్ నుండి ఐదు భారీ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. మరి ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ కూడా సంక్రాంతి రేసులోకి వచ్చింది.

Exit mobile version