ఫిబ్రవరి 20న ‘అనేకుడు’ విడుదల

Anekudu-releaseరఘువరన్ బి.టిక్ చిత్ర సూపర్ హిట్ తో తెలుగు ప్రేక్షేకులు దగ్గరయైన ధనుష్..ఇప్పుడు అనేకుడు గా మళ్లీ రాబోతున్నాడు. కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపైన రూపుదిద్దుకున్న ‘అనేకుడు’ ఆడియో ఇటీవలే విడుదలై, మంచి సక్సెస్‌ అయింది. చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల ఫిబ్రవరి 20న విడుదలకు రెడీ అయ్యింది.

ధనుష్‌ సరసన అమైరా దస్తూర్‌ కధానాయికగా నటించిన ఈ చిత్రంలో కార్తీక్‌, ఐశ్వర్య, ఆశీష్‌ విద్యార్ధి వంటి వారు ముఖ్య పాత్రలో నటించారు. హరీష్‌ జైరాజ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి పాటలు: సాహితి, వనమాలి: ఛాయాగ్రహణం: ఓం ప్రకాష్‌; ఎడిటింగ్‌: ఆంథోని లు పనిచేసిన సాంకేతిక వర్గం. నిర్మాతలు: కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌ స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.వి. ఆనంద్‌.