Site icon TeluguMirchi.com

డీఎస్‌పీ వాయించేస్తున్నాడు

devisreeఈనెల 28న లెజెండ్‌ని తీసుకురావ‌డానికి అన్ని ఏర్పాట్లూ జ‌రుగుతున్నాయి. షూటింగ్ పార్ట్ పూర్తయింది. మిగిలిన ఐటెమ్ గీతాన్ని బాల‌కృష్ణ – హంసానందినిల‌పై తెర‌కెక్కించారు. ఇక‌… ఆర్‌.ఆర్ ఒక్కటే బాకీ. ప్రస్తుతం లెజెండ్‌కి సంబంధించిన ఆర్‌.ఆర్ చెన్నైలో జ‌రుగుతోంది. అక్కడ దేవిశ్రీ ప్ర‌సాద్ లెజండ్‌కి ఆర్‌.ఆర్ ఇస్తున్నాడు. ద‌ర్శకుడు బోయ‌పాటి శ్రీ‌ను ద‌గ్గరుండి ఈ ప‌నుల‌న్నీ చూసుకొంటున్నారు. పాట‌లు, ప్రచార చిత్రాల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. శాటిలైట్ కూడా భారీగా ప‌లికే అవ‌కాశాలున్నాయి. మా టీవీ శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకొనే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఈనెల 28న ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం ఖాయ‌మ‌ని, అందుకే టీమంతా రాత్రి ప‌గ‌లూ క‌ష్టప‌డుతోంద‌ని చిత్రబృందం చెబుతోంది.

Exit mobile version