Site icon TeluguMirchi.com

పవన్ పాట పై దేవిశ్రీ !

devisree pavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ లో ఓ పాట పాడారు అని ఓ వార్త కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. అయితే ఇది వట్టి గాలి వార్తకాదు. నిజమేనని ఖరారు చేశాడు ఆ చిత్ర సంగీత సంగీత దర్శకుడు దేవిశ్రీ. ఈ సినిమాలో పవన్ చేత సరదాగా ఓ బిట్ సాంగ్ పాడించాం. అందర్నీ సర్ప్రైజ్ చేయడం కోసం ఆయన పాడిన పాటను ఆల్బంలో చేర్చలేదు. ఈ పాట అందర్నీ అలరిస్తుంది” అంటున్నాడు దేవిశ్రీ. పవన్ కల్యాణ్ ఎలాంటి ట్యూన్ కైనా ఇట్టే సెట్టయిపోతారని, ప్రేక్షకుల్లో ఆయనకున్న ఫాలోయింగ్, ఆయనకున్న చిత్రమైన బాడీ లాంగ్వేజ్ వల్లే ఇది సాధ్యపడుతోందని దేవి చెప్పుకొచ్చాడు.

Exit mobile version