‘గౌతమీపుత్ర ‘ లో మేస్త్రో ఇళయరాజా

Ilayaraja-GWPనందమూరి బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్ లో బాలయ్య బాబు 100 వ చిత్రంగా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రం నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవి తప్పుకున్నాడనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే. అయితే ఈ వార్త కరెక్ట్ అని తెలుస్తున్నాయి. మరి దేవి తప్పుకుంటే ఎవర్ని తీసుకుంటారు అనే సందేహాలు అందరి మదిలో కలుగుతున్నాయి.

క్రిష్ మాత్రం ఈ సినిమాకు కంచె చిత్రానికి మ్యూజిక్ అందించిన చిరంతన్ భట్ ను ముందుగా అనుకున్నాడట. కానీ ఇలాంటి చారిత్రక నేపథ్యం కలిగిన చిత్రానికి అతనికంటే , మ్యూజిక్ మేస్త్రో ఇళయరాజా అయితే బాగుంటుందని భావిస్తున్నాడట. బాలయ్య సైతం రాజాకే మొగ్గు చూపించడం తో ఇళయరాజా ను కన్ఫామ్ చేసే ఆలోచనలో క్రిష్ ఉన్నాడట. మరో రెండు రోజుల్లో మ్యూజిక్ డైరెక్టర్ ఫై అధికారిక ప్రకటన తెలియనుంది.

ఈ చిత్రాన్ని వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. బిబో శ్రీనివాస్‌ సమర్పిస్తున్నారు. యావత్ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి అయిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ జీవితంపై ఈ సినిమా రూపుదిద్దుకోనుంది.