Site icon TeluguMirchi.com

కరోనా కుట్ర చైనాదే అంటున్న దేవరకొండ

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా కారణంగా దేశం మొట్ట లాక్ డౌన్ ప్రకటించడం తో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ మానవుడి నుంచి మానవుడికి వ్యాప్తి చెందుతుందని చైనాకు ముందే తెలుసు అని.. వూహాన్ లో వెలుగుచూశాక 7 మిలియన్ల మంది వివిధ ప్రాంతాలకు దేశాలకు చైనా విడిచిపెట్టిందని ఇయాన్ బ్రెమ్మర్ అనే వ్యక్తి తాజాగా ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్ ను రీట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఘాటుగా స్పందించాడు. మనం కరోనాతో లాక్ డౌన్ లో ఉండడానికి.. ఇంత మంది చనిపోవడానికి చైనా నిర్లక్ష్యం – కుట్రనే కారణమని.. ఈ స్థితికి ఖచ్చితంగా చైనాదే బాధ్యత అని ఆనంద్ దేవరకొండ ట్వీట్ లో మండిపడ్డారు. వూహాన్ నుంచి 7 మిలియన్ల మందిని చైనా వదిలేసిందని.. వారే ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రబలడానికి కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version