Site icon TeluguMirchi.com

Devara : ‘దేవర’ సెకండ్ సింగిల్ అప్డేట్.. పోస్టర్ అదుర్స్..


జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవ‌ర’ కోసం అభిమానులు ఎంత ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారో అంద‌రికీ తెలిసిందే. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ప్ర‌తిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో గతంలో వ‌చ్చిన ‘జ‌న‌తాగ్యారేజ్’ సూప‌ర్ హిట్ కావ‌డంతో ‘దేవ‌ర‌’ పై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. ఇక ఇప్ప‌టికే రిలీజైన ఈ చిత్ర పోస్ట‌ర్స్, ఫ‌స్ట్ సింగిల్, టీజ‌ర్ ల‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఓ బిగ్ అప్డేట్ ఇచ్చారు మేక‌ర్స్.

Also Read : రూ.100 కే ‘కల్కి’ టికెట్..

‘దేవర’ సినిమాలోని రెండో సాంగ్ ను ఈ నెల‌ 5న విడుద‌ల చేస్తున్న‌ట్లు అధికారకంగా పోస్ట‌ర్ ద్వారా తెలిపింది చిత్రబృందం. ఈ పోస్టర్ ను చాలా రొమాంటిక్ గా డిజైన్ చేసారు. ఎన్టీఆర్ న్యూ లుక్ లో ఆకట్టుకోగా.. జాన్వీ కపూర్ దేవకన్యలా మెరిసిపోతుంది. ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్లపై సుధాకర్‌, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా నటిస్తున్నాడు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుంది.

Also Read : ‘మిస్టర్ బచ్చన్’ నుండి ‘జిక్కీ’ వచ్చేసింది !!

Exit mobile version