Site icon TeluguMirchi.com

Devara 4 Days Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ సునామీ!


ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర వసూళ్ల సునామీ భీభత్సం సృష్టిస్తోంది. మిక్స్డ్ టాక్‌తో మొదలైన దేవర.. వరల్డ్ వైడ్‌గా మూడు రోజుల్లోనే 304 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో.. సోలోగా ఎన్టీఆర్ కెరియర్‌లో ఫస్ట్ 300 కోట్ల క్లబ్‌లో ఎంటరైన సినిమాగా దేవర నిలిచింది. అంతేకాదు.. ఎన్టీఆర్ కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ దిశగా దేవర దూసుకుపోతుంది. వీకెండ్‌తో పోల్చుకుంటే నాలుగో రోజైన సోమవారం కలెక్షన్స్ తగ్గినప్పటికీ.. తెలుగు రాష్ట్రాల్లో 5.40 కోట్ల షేర్ కలెక్షన్స్‌ రాబట్టింది. దీంతో.. తెలుగులో దేవర దుమ్ముదులిపేస్తుందనే చెప్పాలి. నాలుగు రోజుల్లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో 93 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది దేవర.

నాలుగు రోజుల వసూళ్లు చూస్తే.. నైజాం-35.38 కోట్లు, సీడెడ్-19.41 కోట్లు, వైజాగ్-9.63 కోట్లు, తూర్పు గోదావరి-6.17 కోట్లు, వెస్ట్ గోదావరి-4.91 కోట్లు, కృష్ణ-5.49 కోట్లు, గుంటూరు-8.44 కోట్లు, నెల్లూరు-3.66 కోట్లు రాబట్టినట్టుగా చెబుతున్నారు. మొత్తంగా నాలుగు రోజుల్లో 93.09 కోట్ల రూపాయల షేర్ వచ్చిందని అంటున్నారు. అంటే.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే దేవర 100 కోట్ల షేర్ దిశగా దూసుకెళ్తుందన్నమాట. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి దేవర 100 కోట్ల షేర్ ఈజీగా రాబడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. అలాగే.. లాంగ్ రన్‌లో భారీ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. దేవరకు దసరా హాలీడేస్ కలిసొచ్చేలా ఉన్నాయి. ప్రస్తుతం థియేటర్లో పెద్ద సినిమాలు లేవు. దసరాకు వస్తున్న సినిమాల్లో దేవరకు పోటీ ఇచ్చే సినిమా లేదు. కాబట్టి.. దసరా వరకు దేవరకు తిరుగు లేనట్టే. ఇక ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించాయి. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరి దేవర బాక్సాఫీస్ నెంబర్ ఎక్కడవరకు వెళ్తుందో చూడాలి.

Exit mobile version