Site icon TeluguMirchi.com

రికార్డు కలెక్షన్లతో దూసుకపోతున్న దేవర.. మూడు రోజుల్లో ఎంతంటే ?


ఎన్టీఆర్ కథానాయకుడిగా నటించిన దేవర సినిమా విడుదలైన మొదటి నుంచే వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. సెప్టెంబరు 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం, తెల్లవారుజామున ప్రీమియర్ షోల నుంచే సూపర్ హిట్ టాక్ తో ముందుకు సాగింది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, టామ్ చాకో ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ నటన, అనిరుధ్ రవిచందర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవరను మరో స్థాయికి చేర్చాయి.

మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 304 కోట్ల గ్రాస్ వసూలు చేసిన దేవర, ఎన్టీఆర్ కెరీర్‌లో సోలోగా హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తొలి రోజు రూ. 172 కోట్ల గ్రాస్ వసూళ్లు, రెండవ రోజు రూ. 71 కోట్లు, మూడవ రోజు రూ. 61 కోట్లు కలిపి మొదటి వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేసింది. విదేశాల్లో కూడా దేవర అద్భుతంగా ప్రదర్శించింది. ఈ రోజు సోమవారం కావడంతో కొంత వసూళ్లు తగ్గే అవకాశం ఉంది. అయితే, అక్టోబరు 2న గాంధీ జయంతి పబ్లిక్ హాలీడే, అక్టోబరు 3 నుండి దసరా సెలవులు ఉండటం సినిమా లాంగ్ రన్‌లో మంచి కలెక్షన్లను అందుకునే అవకాశాలను పెంచుతోంది.

Exit mobile version