Site icon TeluguMirchi.com

ఈదేవ‌దాస్ అక్కినికి అంకితం

devdasఅక్కినేని జీవితంలో మ‌ర‌పురాని చ‌రిత్ర‌… దేవ‌దాస్‌. ప్రపంచ భాష‌ల్లో శ‌ర‌త్ న‌వ‌ల దేవ‌దాస్ సినిమాగా వ‌చ్చింది. కానీ.. అక్కినేనిలా ఆ పాత్రలో మెప్పించిన మ‌రో న‌టుడు లేడు. ఆ సినిమా స్ఫూర్తితో రూపుదిద్దిన చిత్రం దేవ‌దాస్ స్టైల్ మార్చాడు. త‌నీష్‌క‌థానాయ‌కుడిగా న‌టించాడు. గుండ్రెడ్డి శ్రీ‌నివాస్‌రెడ్డి ద‌ర్శకుడు. ఈ చిత్రాన్ని అక్కినేని నాగేశ్వర‌రావుకి అంకితం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శకుడు మాట్లాడుతూ దేవ‌దాస్ సినిమాని వంద‌ల‌సార్లు చూశా. ఆ స్ఫూర్తితో రాసుకొన్న క‌థ ఇది. ఆ దేవ‌దాస్‌లో బాధ‌, ఎమోష‌న్స్ క‌నిపిస్తాయి. ఈ దేవ‌దాస్ మాత్రం పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది. క‌చ్చితంగా అంద‌రికీ న‌చ్చే చిత్రం అవుతుంది. త్వర‌లోనే పాట‌ల్ని విడుద‌ల చేస్తామ‌న్నారు.

Exit mobile version