పవన్ పై మనసుపడ్డ పదుకొనే!!

pawan-and-deepika

సౌత్ సూపర్ స్టార్ రజినీ కాంత్ లెటెస్ట్ మూవీ ’కొచ్చియాడన్’ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మొదటి షో తోనే హిట్ టాక్ ను సొంతం చేసుకొంది. తెలుగులో ’విక్రమ సింహా’ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రం ద్వారా తొలి సారి దక్షిణాదికి పరిచయమైంది బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకోనె. ఇక, ఇప్పుడు తెలుగులో కూడా నటించడానికి సై అంటోంది. అందరిలాగే ఈ భామ కూడా పవన్ జపమే చేస్తోంది. పవన్ నుంచి ఆఫర్ వస్తే కనుక డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి రెడీ అని చెప్పిందట. ఆమె మేనేజర్ టాలీవుడ్ నిర్మాతలతో టచ్ లో వున్నట్లు సమాచారమ్. పవన్ తాజా చిత్రం ‘గబ్బర్ సింగ్ 2’ పదుకోనె సెట్ అవుతుందేమో చూడాలి..