Site icon TeluguMirchi.com

విజయ్ తో రోమాన్స్ !

vijayబాలీవుడ్‌లో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న దీపికా పడుకోన్‌ కోలీవుడ్‌పై మనసు పారేసుకుంది. బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తమిళ సూపర్‌స్టార్‌ విజయ్‌తో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న కొచ్చాడియన్‌ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పుడు ఇళయదళపతి విజయ్‌ న్యూ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో కోలివుడ్ ఆఫర్ ను ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం కోసం భారీ రెమ్యూనరేషన్‌ డిమాండ్ చేసిందట. అయితే దీపికా కున్న క్రీజ్ తో నిర్మాతలు భారీ ఎమౌంట్ ఇవ్వడానికి ఓకే అనేశారు. త్వరలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Exit mobile version