Site icon TeluguMirchi.com

హాలీవుడ్ ఎంట్రీ అదిరింది

deepika‘ఓ శాంతి ఓమ్’ చిత్రం తో బాలీవుడ్ తెరకు పరిచయమైనా ముద్దుగుమ్మ దీపిక పడుకొనే. తొలి చిత్రంతోనే తన నటన తో బాలీవుడ్ ప్రేక్షకులను పడగోట్టేసి ఇండస్ట్రీ లో హై స్పీడ్ లో దూసుకు పోయింది. అనేక విజయాలు సొంతం చేసుకుంది. ఇప్పటి వరకూ బాలీవుడ్ సూపర్ సక్సెస్ఫుల్ సినిమాల్లో కనిపించిన ఈ భామ ప్రస్తుతం హాలీవుడ్ లో ఓ క్రీజీ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ యాక్షన్ సీరీస్ సినిమాల గురించి చాలా మందికి తెలిసే వుంటుంది. ఇప్పటి వరకు ఈ సీరీస్ లో ఆరు సినిమాలు వచ్చాయి. ఈ సీరిస్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు ఏడో సీరీసి నిర్మాణంలో వుంది. హాలీవుడ్ నటులైన విన్ డీజిల్, జాసన్ స్టాతం మరియు ద్వాయ్నే జాన్సన్ (ది రాక్) ఈ సినిమాలో నటించనున్నారు. హీరోయిన్స్ మిచెల్లె రోడ్రిగ్యూఎజ్, జోర్డన్న బ్రెవ్స్టర్ లతో దీపిక జాయిన్ కానుంది. యూనివర్శల్ పిక్చర్స్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Exit mobile version